VKB: కాడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములు కోల్పోతున్న రైతులకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం బాధితులకు మద్దతుగా నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలు, రైతులు నష్టపోతున్నారని మండిపడ్డారు. రైతుల పక్షాన నిరంతరం పోరాడతామని పేర్కొన్నారు.