నంద్యాల టీడీపీ కార్యాలయం నందు శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమంను మంత్రి ఎన్.ఎండి. ఫరూక్ నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ వేదిక ద్వారా పలువురు తమ సమస్యలను మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధించిన శాఖల అధికారులకు ఆదేశించారు.