MNCL: పదేళ్ల పాలనలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.లక్ష 70 వేల వడ్డీ కట్టిందని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు.