MLG: ములుగులో ఇంటింటా సీపీఐ కార్యక్రమాన్ని డా. కే. నారాయణ ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పేదల ఇళ్లు, రేషన్, పెన్షన్, సాగునీరు వంటి సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించి ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెస్తామన్నారు. ఈ. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.