కర్నూలు మండలం పసుపుల గ్రామంలోని తన స్వగృహంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ప్రజా వినుతుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వారి నుండి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడారు. మరి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.