GDWL: అయిజ కొత్త బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ బస్సు శుక్రవారం బైక్ను బలంగా ఢీకొట్టింది. బస్సు ముందు టైరు ఒక్కసారిగా బైక్ పైకి ఎక్కడంతో బైక్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. అదృష్టవశాత్తు బైక్ నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.