SRPT: తిరుమలగిరిలోని కాన్వెంట్ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ సోంసన్ గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యతను క్రైస్తవులకు వివరించారు. సర్వ మానవాళి రక్షణ కోసం యేసుక్రీస్తు తన ప్రాణం పణంగా పెట్టాడని, లోక పాపముల నుంచి మానవాళిని విడిపించారన్నారు. ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు చూపిన మార్గంలో నడవాలని కోరారు.