KRNL: ఆదోని టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు 45 మంది బాధితులకు రూ.18.14 లక్షల చెక్కులు శుక్రవారం అందజేశారు. ఈ సాయం పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.