GDWL: రాజోలి మండల కేంద్రంలో ఉన్న పురాతన బావిని గత మూడు నెలలుగా గ్రామ యువకులు శుభ్రం చేశారు. ‘మై తెలంగాణ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వ్యవస్థాపకులు మాన్‌దొడ్డి హసన్’ బావి మోటార్ కొరకు రూ. 50 వేల విరాళం ఇచ్చారు. ఆదివారం రాజోలి ఎస్ఐ గోకారి, మాజీ జిల్లా కో-ఆప్షన్ సభ్యులు నిషాక్ మోటార్‌ను ప్రారంభించారు. యువకులు పురాతన బావిని శుభ్రం చేయడం ఆనందంగా ఉందని స్థానిక SI అన్నారు.