TG: సీనియర్ కార్యకర్తలను కాపాడుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీని వీడుతున్నవారు పునరాలోచించాలని సూచించారు. జీవన్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యేతో సమస్య ఉందని తెలిపారు. పార్టీలోనే కొనసాగాలని పలుమార్లు కోరామని గుర్తు చేశారు. జీవన్ రెడ్డికి పార్టీ అన్నీ ఇచ్చిందని పేర్కొన్నారు.