MNCL: శ్రీరాంపూర్ GM ఆఫీస్ సమీపంలోని రింగ్ రోడ్డులో శుక్రవారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మలుపు వద్ద అదుపుతప్పిన లారీ బోల్తా పడటంతో సంజీవ్ కుమార్, అప్సర్ దాస్ అనే వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులకు 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరారు కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.