TG: బీసీలంటే కాంగ్రెస్ పార్టీకి చిన్నచూపు అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 100 రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ అన్నారు.. 900 రోజులైనా గొర్రెల పంపిణీ చేయలేదన్నారు. బీసీలకు రూ.1,370 కోట్లు కేటాయించి.. రూ.6 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు. గొల్ల, కురుమలకు మంత్రి పదవి లేదన్నారు. కార్పొరేషన్లు కాగితాలకే పరిమితమయ్యాయని గుర్తచేశారు.