ADB: ఉట్నూర్ మండలం దంతన్‌పల్లి గ్రామానికి చెందిన నిరంజన్ రెడ్డికి మంజూరైన రూ. 40 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాలతో స్థానిక ఉపసర్పంచ్ మొహమ్మద్ ముబీన్ గురువారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అలాగే సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు చెక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.