HNK: హనుమకొండ కాంగ్రెస్ మెడికల్ వింగ్ ఛైర్మన్ గా డాక్టర్ పీ. శ్రవణ్ కుమార్ నియమితులయ్యారు. శ్రవణ్ కుమార్కు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలో వైద్య విభాగం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నూతన ఛైర్మన్ కు జిల్లా అధ్యక్షుడు సూచించారు.