NLG: కొండమల్లేపల్లి మండలానికి చెందిన MA కైసర్ ఖాన్ ఆనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆసుపత్రికి చేరుకొని కైసర్ ఖాన్ను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులకు సూచించిచారు. వారితో మండల పార్టీ నాయకులు ఉన్నారు.