CTR: కుప్పంలో డా. YC జేమ్స్ ఎన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో POLYCETకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ రామకృష్ణ రావు తెలిపారు. పాలీసెట్ రాసే విద్యార్థుల కోసం రేపటి నుంచి 23వ తేదీ వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నట్లు చెప్పారు. పరీక్షా నమూనా, ప్రశ్నాపత్రం ధోరణి, ముఖ్య అంశాలపై ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తామన్నారు.