KNR: సైదాపూర్-మొలంగూర్ ప్రధాన రహదారి సోమారం శివారులోని సోమేశ్వర కుంట మత్తడి వద్ద బ్రిడ్జి నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలంలో వర్షం కురిస్తే మత్తడి నీటితో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ముత్తడి వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.