కాకినాడ రూరల్ కొవ్వూరు వారాహి ఆలయాన్ని దేవాదాయ శాఖ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండటం, వారు విరాళాలు వసూలు చేయడంపై ఈవోలు వేణు, సోమరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలాంటి పనులు చేయవద్దని హెచ్చరించారు. ఆలయ పరిస్థితిపై జిల్లా దేవాదాయ అధికారికి నివేదిక ఇస్తామని తెలిపారు