GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 16న జరగనుంది. జడ్పీ ఛైర్పర్సన్ క్రిస్టినా అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పంచాయతీరాజ్ సహా పలు శాఖల పనితీరుపై చర్చించనున్నారు. మూడు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారు. శాఖల వారీగా ప్రగతి నివేదికలను సమీక్షించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.