TG: రైతులను మోసం చేసే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హెచ్చరించారు. అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రైతులను బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదన్నారు. రెండు రోజులుగా ధర తగ్గించి.. మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారని, ప్రస్తుతం రూ.2,200 నుంచి 2,500 వరకే ఇస్తున్నారని రైతులు మంత్రికి వివరించారు. దీంతో మంత్రి మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చారు.