TG: ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్కు గొప్ప చరిత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టెక్స్టైల్స్ కేవలం పరిశ్రమే కాదు.. చేనేతలకు జీవితమన్నారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారడమే తమ లక్ష్యమన్నారు. దక్షిణాసియా టెక్స్ టైల్స్ క్యాపిటల్ గా తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలిపారు.