NRPT: మక్తల్ మండలం గొలపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదటిసారిగా ఏర్పాటు చేసిన రథాన్ని పూలమాలతో అలంకరించి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం రథాన్ని లాగేందుకు గ్రామ యువకులు ఉత్సాహంగా పోటీపడ్డారు. ఇంత పెద్ద ఉత్సవాన్ని గ్రామంలో తొలిసారి నిర్వహించడం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.