NLG: క్షయ వ్యాధి నిర్మూలనలో శాలిగౌరారం మండలం విశేష ప్రతిభ కనబరిచి ఆదర్శంగా నిలిచింది. కేంద్రం చేపట్టిన ‘టీబీ ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని తిరుమలరాయినిగూడెం, తుడిమిడి, ఉప్పలంచ టీబీ రహిత గ్రామాలుగా గుర్తింపు పొందాయి. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఈ గ్రామాలను ఎంపిక చేసినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ సూర్య శిల్ప తెలిపారు.