HYD: అధిక లాభాల పేరుతో ఓ కేటుగాడు రూ.3.6 కోట్లు దోచేశాడు. మాదాపూర్‌కు చెందిన వ్యాపారి శ్రీనివాసవర్మకు అక్కు మహేష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ‘జయంత్ బిస్వాల్.కామ్’ లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించాడు. దీంతో శ్రీనివాసవర్మ సహా 26 మంది ఏకంగా రూ.3.6 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. ఆ తర్వాత మహేష్ పరారవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.