ADB: ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న పనులకు అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలని MP గోడం నగేశ్ అన్నారు. గురువారం నిర్వహించిన పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ నగేశ్ పలు అంశాలపై మాట్లాడారు. జిల్లాలోని ఆర్ అండ్ బి, పంచాయత్ రాజ్, PMGSY ద్వారా మంజూరైన రోడ్లకు అనుమతులు లేక పనులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు.