BHPL: రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. నియోజకవర్గంలో పలువురు అర్హులైన రైతులకు సబ్సిడీపై కూరగాయల విత్తనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. రైతులు పంటల సాగులో మెలకువలు పాటించి అధిక దిగుబడులు పొందాలని, ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాలను అందజేస్తామన్నారు.