బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు మొదలైంది. శర్వానంద్ ‘బైకర్’, నిహారిక నిర్మించిన ‘రాకాస’ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ‘బైకర్’ తెలుగులో తొలి మోటోక్రాస్ మూవీగా యాక్షన్ ప్రియులను ఊరిస్తుండగా, సంగీత్ శోభన్ హీరోగా సూర్యగ్రహణం నేపథ్యంతో సాగే ‘రాకాస’ ఫాంటసీ కామెడీతో అలరించేందుకు సిద్ధమైంది. ఈ రెండు విభిన్న కథాంశాల్లో ఈ వీకెండ్ విన్నర్ ఎవరో చూడాలి!