అనంతపురం: జిల్లాలో 23 హెక్టార్లకు రాయితీతో డ్రిప్, స్పింక్లర్లు మంజూరు చేసినట్లు ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్ రెడ్డి తెలిపారు. డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీలో రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచామన్నారు. డ్రిప్ మంజూరు చేసిన రైతులకు త్వరితగతిన మెటీరియల్స్ సరఫరా చేయాలన్నారు. రైతుల పొలాలలో డ్రిప్, స్ప్రింక్లర్లు బిగించే కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు.