PDPL: ధర్మారం మండలంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో సమస్యలు వెల్లువెత్తాయి. గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో సరైన సేవలు అందించడం లేదని, పలు వార్డులలో నీటి కొరత ఉందని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సర్పంచ్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.