SRD: కంగ్టిలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి మఠం నుండి స్వామివారి శోభా యాత్ర శుక్రవారం తెల్లవారుజామున వరకు కొనసాగింది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారంగా మఠంలోని సిద్దేశ్వర స్వామి ఉత్సవ మూర్తిని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. దారి పొడవున ప్రతి ఇంట మహిళలు మంగళహారతులు పట్టుకొని స్వామివారిని స్వాగతించారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేసి సిద్దేశ్వర స్వామిని దర్శించుకున్నారు.