GDWL: గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల NSS యూనిట్ ఆధ్వర్యంలో గొర్లఖాన్ దొడ్డిలో రెండో రోజు వేసవి శిబిరం కొనసాగింది. వాలంటీర్లు గ్రామంలో ర్యాలీ నిర్వహించి పారిశుధ్యం, మొక్కల పెంపకం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. నినాదాలతో ఊరేగింపు చేపట్టి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ KSD రాజు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.