W.G: దర్భరేవు గ్రామంలో గురువారం ఒక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కర్రీ ఆనందమణి (27) అనే మహిళ తన నివాసంలోని బాత్రూమ్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.