నెల్లూరు కపాడిపాలెంలోని సెయింట్ జోసెఫ్ కేథడ్రల్ చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన శిలువ మార్గం కార్యక్రమంలో MLC పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. స్వయంగా శిలువను మోసి భక్తి భావాన్ని చాటుకున్న ఆయన, యేసుక్రీస్తు త్యాగం, క్షమాగుణం నేటి సమాజానికి ఎంతో ఆదర్శమని కొనియాడారు. లోక కల్యాణం కోసం క్రైస్తవ సోదరులు చేసే ప్రార్థనలు అభినందనీయమని అని తెలిపారు.