KDP: సిద్దవటం మండలం మాధవరం-1 పరిధిలోని బంగారుపేట గ్రామ శివారులో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారికి ఇవాళ భక్తిశ్రద్ధలతో పూజలు జరిగాయి. ఈ సందర్భంగా.. అర్చకులు అమ్మవారికి అభిషేకం, అలంకరణ, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.