SRPT: ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుందని కోదాడ మున్సిపల్ రెండో వార్డు కౌన్సిలర్ కాటం రాజు పేర్కొన్నారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం కాలనీలో ప్రభుత్వం చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.