MNCL: రామకృష్ణాపూర్‌కు చెందిన కలువల సుకన్య అత్యున్నత జూనియర్ సివిల్ జడ్జి పదవికి ఎంపికయ్యారు. గురువారం విడుదలైన జూనియర్ సివిల్ జడ్జి ఫలితాల్లో ఆమె తన ప్రతిభను చాటి ఈ విజయాన్ని అందుకున్నారు. స్థానిక రాంనగర్ నివాసితులైన కలువల నిర్మల రమేష్ దంపతుల చిన్న కుమార్తె సుకన్య పట్టుదలతో చదివి న్యాయశాఖలో అత్యున్నత కొలువును సాధించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.