TPT: తిరుమలలో శ్రీవారి సేవకు వచ్చిన వ్యక్తి అదృశ్యమయ్యారు. ఆదిలాబాద్‌కు చెందిన మేకల్యూర్ నర్సింగ్ (55) గత నెల 31న స్థానిక సేవాసదన్ వద్ద తప్పిపోయారు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా కనిపించకపోవడంతో భార్య విజయ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలిస్తే 94407 96772కు తెలియజేయాలని కోరారు.