SRD: కంగ్టి ప్రజల మహిమాన్వితుడు కోరిన కోరికలు కొంగు బంగారంలా తీర్చే సిద్దేశ్వర జాతర ఉత్సవం భక్తి పారవశ్యమైంది. నేటి స్వామివారి శోభాయాత్ర మహారథం వరకు సాగింది. రథం ఎదుట ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో ఉత్సవ మూర్తిని ఎత్తుకున్న జంగం స్వాములతో పాటు భక్తులు అగ్నిగుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు వేలాది సంఖ్యలో తరలి రావడంతో జనసంద్రమైంది.