VSP: అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్ ఆమోదం లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు వెల్లివిరిశాయి. ప్రభుత్వం, కూటమి పార్టీల శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం కలెక్టరేట్ భవనాన్ని ఆధునాతన విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు. రంగురంగుల కాంతులతో మెరిసిపోతున్న కలెక్టరేట్ భవనం నగర ప్రజలను ఆకట్టుకుంటోంది.