KKR ఆటగాడు రింకూ సింగ్ ఫీల్డింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. KKR తరఫున అత్యధిక క్యాచ్‌లు (41) పట్టిన నాన్ వికెట్‌కీపర్‌గా ఆండ్రీ రసెల్(40) రికార్డును అధిగమించాడు. SRHతో జరిగిన మ్యాచ్‌లో 2 క్యాచ్‌లు పట్టడంతో ఈ ఘనత సాధించాడు. రసెల్ 133 మ్యాచ్‌ల్లో 40 క్యాచ్‌లు పట్టగా, రింకూ కేవలం 61 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.