KKR కెప్టెన్ అజింక్య రహానె అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. తన IPL కెరీర్లో 200వ మ్యాచ్ ఆడుతున్నాడు. SRHతో జరుగుతున్న మ్యాచ్‌తో ఈ ఘనత సాధించాడు. IPL చరిత్రలో ఈ మైలురాయిని ఇప్పటివరకు 11 మంది మాత్రమే చేరుకున్నారు. ఈ జాబితాలో ధోనీ (278) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ (273), కోహ్లీ (268) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రహనే తన 18 ఏళ్ల IPL ప్రయాణంలో 5099 పరుగులు చేశాడు.