GDWL: గద్వాల జిల్లా సమీపంలోని జమ్మిచేడులో వెలసిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారికి శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని అత్యంత వైభవంగా విశేష పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. అమ్మవారికి పవిత్ర కృష్ణా నది జలాలతో మంగళ స్నానాలు చేయించి, అనంతరం నిమ్మకాయల పూజ, ఆకుపూజ, విశేష హోమం శాస్త్రోక్తంగా జరిపించారు.