SRD: మానవతావాదంతో కష్టంలో ఉన్న కార్మిక కుటుంబాలను ఆదుకుంటున్నామని CITU నాయకుడు కే రాజయ్య అన్నారు. పటాన్ చెరు మండలం పాష మైలారం కిర్బీ పరిశ్రమలో కార్మిక సేవలు అందిస్తూ అనారోగ్యానికి గురై చనిపోయిన ఆర్ సత్యనారాయణ కుటుంబానికి 27 లక్షల రూపాయల చెక్కును ఇచ్చినట్లు తెలిపారు. కిర్బీ కార్మికుల ఒకరోజు వేతనంతో పాటు, పరిశ్రమ యాజమాన్యం తోడ్పాటుతో ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు.