BHNG: తుర్కపల్లి మండలం కేంద్రానికి చెందిన తెలంగాణ రాష్ట్ర గాయకుడు కళాకారుడు యండి జహంగీర్ గురువారం గుండె పోటుతో మృతిచెందగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండి జహంగీర్ శవపేటిక(జానాజా డోలిని)బీర్ల ఐలయ్య మోసి ఘనమైన నివాళులర్పించారు.