NZB: హిందువులంతా సంఘటితంగా ఉండి మన ఆచార సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి పిలుపునిచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణం, ఫతేపూర్, గోవింద్ పెట్, మామిడిపల్లి గ్రామాల్లోని హనుమాన్ ఆలయాలను ఆయన దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. మన సంస్కృతిని భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.