JN: చిల్పూర్ మండలం క్రిష్ణాజిగూడెం గ్రామంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీపీఎం గ్రామ కార్యదర్శి పోలు సంపత్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో దాదాపు 100 ఎకరాలలో రైతులు మొక్కజొన్న పంట సాగుచేస్తున్నారని, కొనుగోళు కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యవసాయధికారుల నిర్లక్ష్యంతో రైతులకు తిప్పలు తప్పడం లేదన్నారు.