గద్వాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు నమోదును సమీక్షించిన కలెక్టర్, 61 పాఠశాలలకు చెందిన 76 మంది బోధన, బోధనేతర సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు గురువారం ఓ ప్రకటనలు తెలిపారు. నోటీసులు అందుకున్న వారు మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ద్వారా హాజరు నమోదు తప్పనిసరి అన్నారు.