ATP: జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26లో మద్యం అమ్మకాలు 16 శాతం వృద్ధి చెందాయి. గతేడాది రూ. 1040.68 కోట్ల విలువైన విక్రయాలు జరగగా, ఈసారి అది రూ. 1207.01 కోట్లకు చేరింది. ఐఎంఎల్ కేసులు 33 శాతం, బీర్ల అమ్మకాలు 79 శాతం మేర పెరిగాయి. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.