NGKL: కొల్లాపూర్ మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో ’99 రోజుల ప్రజాపాలన-ప్రగతిప్రణాళిక’ గ్రామసభలు నిర్వహించారు. ప్రభుత్వ అజెండా ప్రకారం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షించారు. ఎల్లూర్లో సర్పంచ్ శశికల అధ్యక్షతన జరిగిన సభలో స్పెషల్ ఆఫీసర్ ఇమాన్యూల్, నిరంజన్ పాల్గొని పథకాలపై అవగాహన కల్పించారు.