MDCL: అల్వాల్ పట్టణ పరిధి ఓల్డ్ అల్వాల్లో సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సాయిరాం గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ గౌడ సంఘం నాయకులు, కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.